రాష్ట్రస్థాయి వుషూలో సాన్వి విద్యార్థుల జయకేతనం

రాష్ట్రస్థాయి వుషూలో సాన్వి విద్యార్థుల జయకేతనం

కొత్తపల్లి, వెలుగు: రాష్ట్రస్థాయి ఉషూ క్రీడల్లో కరీంనగర్​జిల్లా రేకుర్తిలోని సాన్వి కాలేజీ విద్యార్థులు సత్తా చాటారు. కాలేజీ కరస్పాండెంట్ ఎర్రంశెట్టి​మునీందర్ ​వివరాల ప్రకారం.. ఈ నెల19, 20వ తేదీల్లో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి 4వ ఉషూ క్రీడల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరఫున పాల్గొన్న సాన్వి విద్యార్థులు పలు విభాగాల్లో పథకాలు సాధించినట్లు పేర్కొన్నారు. యు.మహిమరాణి, రెడ్డి భానుశ్రీ, అయిలి నిశాంత్, చిపిరిశెట్టి వేద వ్యాస్, రుద్రారపు సాయిచరణ్, ఆడెపు ఆత్రేయ బంగారు, దాసరి నందిని, మడప రక్షిత, గుండేటి లక్ష్మీప్రసన్న, పొన్నాల హర్షవర్ధన్, జి.వికాస్​బాబు రజత, ఎ.నవదీప్, హర్షవర్ధన్, ఆడెపు అత్రేయ, గుడికందుల అనుశ్రీ కాంస్య పతకాలు సాధించారన్నారు. అక్టోబర్ లో చెన్నైలో జరిగే 25వ జాతీయస్థాయి పోటీలకు రాష్ట్రం తరఫున మహిమరాణి, భానుశ్రీ, నిశాంత్, సాయిచరణ్, వేదవ్యాస్, అత్రేయ ఎంపికయ్యారని తెలిపారు. వారిని యాజమాన్యం, టీచర్లు అభినందించారు.