మహబూబ్నగర్ జిల్లాలో రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ..జిల్లా స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్, టైపిస్ట్‌‌‌‌‌‌‌‌

మహబూబ్నగర్ జిల్లాలో రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ..జిల్లా స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్, టైపిస్ట్‌‌‌‌‌‌‌‌

మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్, వెలుగు: క్రీడాకారులకు ఆహార సరఫరా చేసిన క్యాటరింగ్ సంస్థకు సంబంధించిన బిల్లుల చెల్లింపు కోసం రూ.లక్ష లంచం తీసుకుంటూ జిల్లా యువజన, క్రీడల అధికారి జక్కు రాజశేఖర్ రెడ్డి, కాంట్రాక్ట్ టైపిస్ట్ గోరె ఉమేశ్​గురువారం ఏసీబీకి పట్టుబడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఇద్దరినీ రెడ్‌‌‌‌‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌గా పట్టుకున్నారు.

ఏసీబీ ఆఫీసర్ల వివరాల ప్రకారం.. మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని ఎస్‌‌‌‌‌‌‌‌ఏటీజీ వాలీబాల్ హాస్టల్‌‌‌‌‌‌‌‌లో ఉన్న క్రీడాకారులకు ఆగస్టు నెలలో ఓ క్యాటరింగ్ సంస్థ ఆహారం సరఫరా చేసింది. ఈ పెండింగ్ బిల్లులను ఆమోదించి, రూ.3.10 లక్షల చెక్కు విడుదల చేయించేందుకు రాజశేఖర్ రెడ్డి రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.

ఈ మేరకు ట్రాప్ నిర్వహించిన ఆఫీసర్లు, బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా రాజశేఖర్ రెడ్డి, ఉమేశ్​ను పట్టుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాలతో చంచల్‌‌‌‌‌‌‌‌గూడ జైలుకు రిమాండ్‌‌‌‌‌‌‌‌పై తరలించారు.