బకాయిలు విడుదల చేయాలని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా

 బకాయిలు విడుదల చేయాలని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా

ముషీరాబాద్‌‌, వెలుగు: రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌‌కాష్‌‌మెంట్ డిఫరెన్స్, ఆర్‌‌పీఎస్–2017 వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సారథ్య కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఆర్టీసీ క్రాస్ రోడ్‌‌లోని బస్​ భవన్ ముందు భారీ ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఇబ్బందులు పడుతున్నామన్నారు. రిటైర్మెంట్ రోజునే రావాల్సిన బెనిఫిట్స్ ఇప్పటికీ రాకపోవడం విచారకరమన్నారు. వృద్ధాప్యంలో ఇబ్బందులు పడుతున్న తమకు బకాయిలు చెల్లించి ఆదుకోవాలని కోరారు.