
- తొలి విడతలో 50 నుంచి 60 కి.మీ
హైదరాబాద్, వెలుగు: ‘‘హాత్‌సే హాత్‌జోడో’’ యాత్రలో భాగంగా ఈ నెల 6 నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉంటుందని పీసీసీ సీనియర్వైస్ప్రెసిడెంట్ మల్లు రవి చెప్పారు. ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క, సారలమ్మ దర్శనం చేసుకొని యాత్రను ప్రారంభిస్తారని తెలిపారు. తొలి విడతలో 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు నడుస్తారని, అన్ని జిల్లాల్లోనూ పాదయాత్ర ఉంటుందని చెప్పారు. భారత్‌జోడో యాత్రలో రాహుల్‌గాంధీతో పాటు నడిచిన పార్టీ నాయకులు బెల్లయ్య నాయక్, కేతూరి వెంకటేశ్ లకు గురువారం గాంధీభవన్‌లో సన్మానం చేశారు. ఈ సందర్భంగా మల్లు రవి మీడియాతో మాట్లాడారు. జోడో యాత్రలో రాష్ట్రం నుంచి 10 మంది చివరిదాకా రాహుల్‌తో కలిసి నడిచారని ఆయన తెలిపారు. తాను కూడా బెల్లయ్య నాయక్‌ను ఆదర్శంగా తీసుకొని రేవంత్‌తో కలిసి నడుస్తానని చెప్పారు.
‘‘రేవంత్పాదయాత్రను మొదట భద్రాచలం నుంచి ప్రారంభించాలని అనుకున్నం. కానీ ఆ రోజు బడ్జెట్ ఉండడంతో భట్టి అసెంబ్లీలో ఉంటారు. అందువల్లే లొకేషన్ మార్చాం” అని వివరించారు. జోడో యాత్రలో చివరిదాకా నడుస్తానో లేదోనని మొదట భయపడ్డానని కాంగ్రెస్ జాతీయ ఆదివాసీ విభాగం వైస్ ప్రెసిడెంట్ బెల్లయ్య నాయక్ అన్నారు. యాత్రతో 14 కిలోల బరువు తగ్గానని చెప్పారు. దేశాన్ని విచ్ఛిన్న శక్తుల నుంచి కాపాడుకునేందుకే రాహుల్ యాత్ర చేశారని పార్టీ ఓబీసీ జాతీయ కన్వీనర్కేతూరి వెంకటేశ్అన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడవడమంటే మామూలు విషయం కాదని పీసీసీ వైస్ప్రెసిడెంట్చామల కిరణ్‌కుమార్ అన్నారు.