ఏకలింగం ఉన్న బీజేపీని మూడు తోకలు చేసిందే కేసీఆరే

ఏకలింగం ఉన్న బీజేపీని మూడు తోకలు చేసిందే కేసీఆరే

కేసీఆర్ దిక్కులేని పరిస్థితిలో కమ్యూనిస్ట్ ల కాళ్లు పట్టుకున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ అన్నారు. గతంలో కమ్యునిస్ట్ లు ఎక్కడ ఉన్నారని అవమానించిన కేసీఆర్..ఇప్పుడు వారితో పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు. కమ్యూనిస్ట్  సోదరులు ఎందుకు కేసీఆర్ ఉచ్చులో పడుతున్నారో తెల్వదన్నారు. వారి నిర్ణయం తమకు తీవ్ర నిరాశను కలిగించిందన్నారు. బీజేపీకి వ్యతిరేకం అని కేసీఆర్ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామీ మీద ఒట్టేసి చెప్పాలన్నారు.

కేసీఆర్ మునుగోడు సభ వల్ల ఒరిగిందేమి లేదని రేవంత్ అన్నారు.  సభలో మునుగోడుకు ఏం చేశారో.. ఏం చేస్తారో చెప్పలేదన్నారు. జాతీయ రాజకీయాలు చెప్పి కేసీఆర్ మళ్ళీ ప్రజలను వంచించే ప్రయత్నం చేశారన్నారు.   కేసీఆర్ కు కోట్ల రూపాయలు సహాయం చేసినట్లు రాజగోపాల్ రెడ్డి  చెప్పారని... వాళ్ల ఇద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి ఆరోపణలపై కేసీఆర్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. డిండీ ఎప్పటిలోగా పూర్తి చేస్తారో కేసీఆర్ చెప్పాలన్నారు. పార్టీ ఫిరాయింపులకు ఆద్యులు కేసీఆరేనన్నారు. పార్టీ విలీనానికి కిటికీలు తెరిచింది.. ఏకలింగం ఉన్న బీజేపీని మూడు తోకలు చేసిందే కేసీఆరే అని విమర్శించారు. రాష్ట్రంలో  లేని బీజేపీని ప్రత్యామ్నాయంగా సృష్టించి కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. తెలంగాణపై బీజేపీ ముప్పేట దాడికి  కేసీఆరే కారణమన్నారు.