కాంగ్రెస్ సోషల్ మీడియాపై దాడి అసలు కారణమేంటీ?

కాంగ్రెస్ సోషల్ మీడియాపై దాడి అసలు కారణమేంటీ?

కాంగ్రెస్ వార్ రూమ్ పై పోలీసులు దాడి చేయడాన్ని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల్లో,అత్యంత క్రియాశీల వ్యవహారాల్లో పాల్గొంటున్న సునీల్ కనుగోలును అరెస్ట్  చేయాలనే దర్మార్గమైన ఆలోచన సీఎం కేసీఆర్ కు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఢిల్లీలో బీఆర్ఎస్   పార్టీ కార్యాలయాన్ని  ప్రారంభించిన రోజే కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పనిచేస్తూ రాహుల్ పాదయాత్రకు సంబంధించిన విషయాలు, యాత్రలో ప్రస్తావించే అంశాలను హైదరాబాద్ లో కాంగ్రెస్ వార్ రూమ్ నుంచి పర్యవేక్షించి సమాచారం సేకరించి రాహుల్ చేత మాట్లాడిస్తున్నారనే అక్కసుతో సునీల్ కనుగోలును అరెస్ట్ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం  ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. 

జాతీయ స్థాయిలో ప్రధాని మోడీ తప్పిదాలు, రూపాయి విలువ పడిపపోవడంపై ప్రజల్లో చర్చకు వస్తున్నాయనే సునీల్ కనుగోలును అరెస్ట్ చేసేందుకు  రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వాస్తవాలు ప్రజలకు తెలుస్తున్నాయనే కోపంతో దాడులు చేయించారని మండిపడ్డారు. కుట్రలు,కుతంత్రాల్లో భాగంగానే వార్ రూమ్ పై రైడ్ జరిగిందన్నారు. కాంగ్రెస్  టాస్క్ ఫోర్స్ టీం  జాతీయస్థాయిలో కాంగ్రెస్ వ్యవహారాలను నిర్వహించడానికి 8 మందికి టాస్క్ ఫోర్స్ టీంలో చోటు కల్పించారు. అందులో ప్రియాంక గాంధీ, సునీల్ కనుగోలుతో పాటు  చిదంబరం, ముఖుల్ వాస్నిక్, జైరామ్ రమేష్, కేసీ వేణు గోపాల్, అజయ్ మాకెన్, రణదీప్ సుర్జేవాలాను కమిటీలో సభ్యులుగా నియమించారు.