10 పాసైతే రూ.10 వేలు..పీహెచ్డీ చేస్తే రూ.5 లక్షలు: రేవంత్

10 పాసైతే రూ.10 వేలు..పీహెచ్డీ చేస్తే రూ.5 లక్షలు: రేవంత్


చేవేళ్ళ సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను ప్రకటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.   ప్రజల కోరిక మేరకే సోనియా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్న రేవంత్  12 అంశాలతో ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ ను ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

 ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ లోని ముఖ్యాంశాలు

  • జనభా ప్రకారం ఎస్సీలకు 18, ఎస్టీలకు 12 శాతం  రిజర్వేషన్లు
  •  ఏబీసీడీ వర్గీకరణ చేసి మాదిగ సోదరులకు న్యాయం చేస్తం
  •  అంబేద్కర్ అభయం హస్తం కింద ఎస్సీ, ఎస్టీలకు రూ. 12 లక్షలు
  • ఇందిరమ్మ పక్కా ఇండ్ల కింద ఎస్సీ, ఎస్టీలకు రూ. 6లక్షలు
  • ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తం
  • ఎస్సీలకు అసైన్డ్ భూములకు పట్టాలు 
  • ఎస్టీలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు
  • సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణ అభివృద్ధి పథకం
  • గిరిజన తండాలకు ఏటా  రూ. 15 లక్షలు
  • ఎస్టీలకు ఇచ్చిన పోడు భూములకు సర్వహక్కులు 
  • ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు పదో తరగతి పూర్తి చేస్తే రూ.10 వేలు
  • ఇంటర్ పూర్తి చేస్తే రూ. 15 వేలు
  •  డిగ్రీ పూర్తి చేస్తే రూ. 25 వేలు 
  • పీజీ పూర్తి చేస్తే  రూ. లక్ష రూపాయలు
  •  పీహెచ్ డీ పూర్తి చేస్తే  రూ.5 లక్షలు 
  •  రాష్ట్రంలో ఐదు ఐటీడీఏలు ఏర్పాటు 
  • ప్రతి మండలంలో ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలు
  • విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఆర్థికసాయం
  • గ్రాడ్యుయేషన్ చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచిత హాస్టల్