మాణిక్ రావ్ ఠాక్రేతో రేవంత్, భట్టి భేటీ

మాణిక్ రావ్ ఠాక్రేతో రేవంత్, భట్టి భేటీ

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్ రావ్ ఠాక్రే తో పలువురు రాష్ట్ర నేతలతో భేటీ అయ్యారు. హైదర్గూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే పొదెం వీరయ్యలు ఆయనను విడివిడిగా కలిశారు. ఈ భేటీలో హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర, అసెంబ్లీ సమావేశాలు తదితర అంశాలపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ నెల 6 నుండి సమ్మక్క సారలమ్మ ఆలయం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించనున్నారు. యాత్రకు సంబంధించి రేవంత్ ఠాక్రేతో రూట్ మ్యాప్ పై చర్చించట్లు సమాచారం. అలాగే అసెంబ్లీ సమావేశాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలనుకుంటున్నట్టు భట్టి విక్రమార్క ఠాక్రేతో చెప్పినట్లు తెలుస్తోంది.