అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు : రేవంత్ రెడ్డి

అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వర్ధన్నపేట పట్టణంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు తప్ప... కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడా లేవన్నారు. కాంగ్రెస్ అధికారం లోకి రాగానే ఇండ్లు లేని ప్రతి పేద కుటుంబానికి రూ.5లక్షల మంజూరు చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి రూ. 5 లక్షల వరకు ఇస్తామన్నారు. రూ. 500 కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుదని చెప్పారు. ఇక కాంగ్రెస్ కార్యకర్త లపై దాడులు చేస్తే సహించేది లేదని రేవంత్ హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత  వడ్డీతో  సహా రుణం తీర్చుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మీ భూములు అమ్ముకుంటున్నాడని రేవంత్ ఆరోపించారు.  వచ్చే ఎన్నికల్లో వర్ధన్నపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని  గెలిపించాలని రేవంత్ కోరారు.