వాణీ జయరాం మృతి పట్ల రేవంత్ రెడ్డి సంతాపం

 వాణీ జయరాం మృతి పట్ల రేవంత్ రెడ్డి సంతాపం

ప్రముఖ సినీ నేపథ్య గాయని వాణీ జయరాం మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆమె అత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పారు. వాణీ జయరాం కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు.

వాణీ జయరాం మృతిపట్ల తెలుగు, తమిళ సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. 1945 నవంబరు 30న  తమిళనాడులోని వెల్లూరులో జన్మంచిన  వాణీ జయరాం పదేళ్ల వయసు నుంచే పాటలు పాడటం మొదలుపెట్టారు. ఆమె అసలు పేరు కలైవాణి. తెలుగుతో పాటుగా 14 భాషల్లో దాదాపు ఆమె 8వేలకు పైగా పాటలు పాడారు. ఇటీవలే కేంద్రప్రభుత్వం ఆమెకు పద్మవిభూషణ్ను ప్రకటించింది.