బీసీలను కులాల వారిగా లెక్క తేల్చాలి

బీసీలను కులాల వారిగా లెక్క తేల్చాలి

రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయన్నారు తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. BCలలో కుల గణాలు లెక్కించడంతో బీసీ విద్యార్ధులు ఉద్యోగాలు పొందే హక్కు ఉంటుందన్నారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో బీసీల కుల లెక్కలు చేపట్టిందని..అయితే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో సాధ్యంకాలేదని తెలిపారు. తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ లో బీసీ జంగ్ సైరన్  ధర్నా కార్యక్రమం చేపట్టారు. ధర్నాలో పాల్గొన్న రేవంత్ రెడ్డి..మద్దతు తెలిపారు. ఇందులో భాగంగా మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్ , ఎంపీలు ఎందుకు బీసీల గురించి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. జంతర్ మంతర్లో బీసీలు ధర్నా చేస్తుంటే వారికి సంబంధించిన 9 మంది సన్నాసి ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం అయ్యారంటే ..అది బడుగు బలహీన వర్గాల ద్వార కాదా అని అన్నారు.

దేశ  ప్రధానమంత్రి బీసీ.. కానీ బీసీలకు మాత్రం అన్యాయం జరుగుతోందన్నారు రేవంత్ రెడ్డి. బలహీన వర్గాల మద్దతు లేకుండా బీజేపీ అధికారంలోకి వచ్చిందా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి మోడీ బీసీ అయ్యాక ..బీసీల గురించి పట్టించుకోవడం లేదని.. బీసీల లెక్కలు ఎందుకు ఇవ్వడం లేదని అని అన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల జనాభా లెక్క పెడతామన్నారు. బీసీల అంశంపై పార్లమెంటులో పోరాడుదాం.. మీ వెంట కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి.