
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. జనవరి 26 నుంచి ఆయన రాష్ట్రంలో పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే లక్ష్యంతో ఈ యాత్ర చేయనున్నారు. త్వరలోనే యాత్రకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ను తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించే చాన్స్ ఉంది.
రేవంత్ టీపీసీసీ చీఫ్‌గా ఉండటంతో ఆయన పాదయాత్రకు ఢిల్లీ హైకమాండ్ అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇటీవల మల్లిఖార్జున ఖర్గేతో జరిగిన భేటీలోనూ పాదయాత్రకు సంబంధించి రేవంత్ చర్చించినట్లు సమాచారం. అందుకు ఖర్గే కూడా సుముఖత వ్యక్తం చేశారని రేవంత్ వర్గం నాయకులు చెబుతున్నారు.