బర్త్ డే రోజైనా నోటిఫికేషన్లు ఇస్తే పండగ చేసుకుంటం

బర్త్ డే రోజైనా నోటిఫికేషన్లు ఇస్తే పండగ చేసుకుంటం

బీజేపీ విషం చిమ్మేప్రయత్నం చేస్తుందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మహిళా లోకాన్ని అవమానించేలా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడారన్నారు. హిమంత బిశ్వ శర్మపై జూబ్లీహీల్స్ పీఎస్ లో కేసు ఫిర్యాదు చేశామన్నారు. కేసు ఒకటైతే సెక్షన్లు మరొకటి పెట్టారన్నారు. కేసును బలహీనపరిచేలా ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. చర్యలు తీసుకోకపోతే నిరసన తెలుపుతామని ముందే చెప్పామన్నారు. నేరం తీవ్రతను తగ్గించి నిందితుడిని రక్షించే  ప్రయత్నం చేస్తున్నారన్నారు. అందుకే  జూబ్లీహిల్స్ పీఎస్ లో మళ్లీ ఫిర్యాదు చేశామన్నారు.

అస్సాం సీఎం మాటలను దేశమంతా ఖండించిందన్నారు. హిమంత బిశ్వ శర్మను సీఎంను వెంటనే భర్తరఫ్ చేయాలన్నారు.  గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలర్పించారన్నారు. అస్సాం సీఎంపై చర్యలుతీసుకుని తెలంగాణ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామన్నారు. కేటీఆర్ వ్యహారం చిన్న పిల్లల వ్యవహారంలా ఉందన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు చనిపోతుంటే.. కేసీఆర్ బర్త్ డే మూడు రోజులు అవసరమా? అని ప్రశ్నించారు.  కేసీఆర్ జన్మదినం రోజు రాష్ట్రంలో ఖాళీలన్నీ భర్తీ చేయాలన్నారు. అప్పుడు ఉత్సవాలు కాదు పండుగ చేసుకుంటామన్నారు. రాష్ట్రంలో చనిపోతున్న పిల్లల తల్లిదండ్రుల ఆవేదన కనిపించడం లేదా అని ప్రశ్నించారు రేవంత్.