కేసీఆర్ హనీ ట్రాప్ లో ఉండవల్లి

కేసీఆర్ హనీ ట్రాప్ లో ఉండవల్లి

కేసీఆర్ ప్రయోగించిన హనీ ట్రాప్ లో ఉండవల్లి పడ్డారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ఒకటేనన్న రేవంత్ ఈ లాజిక్ ఉండవల్లికి అర్థం కావడం లేదన్నారు.  కేసీఆర్ తో భేటీ తర్వాత ఉండవల్లి ఆయన భజన చేస్తుండని..ఆయన పట్ల గతంలో గౌరవం ఉండేందని..కానీ ఇప్పుడు అది లేదని అన్నారు.  సోనియా, రాహుల్ సహా విపక్ష నాయకులను కేసులతో పేరుతో వేధిస్తున్న మోడీ కేసీఆర్ పై మాత్రం ఈగ వాలకుండా చూసుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్- మోడీది ఫెవికాల్ బంధం అని వ్యాఖ్యానించారు. విభజన మీద ఉండవల్లి రెండు పుస్తకాలు రాశారని..తెలంగాణ ఉద్యమకారులను రజాకార్ల పేరుతో అవమానించారని చెప్పారు. 

అటువంటి వ్యక్తిని సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ కు పలిచి అతిథి సత్కారాలు చేయడం సిగ్గుచేటన్నారు రేవంత్. దోచుకున్న సొమ్మును కాపాడుకోవడం కోసమే కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరదీశారని రేవంత్ ఆరోపించారు. బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చి మోడీని గద్దెనెక్కించడమే కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. బీఆర్ఎస్ అంటే బీహార్ రాష్ట్ర సమితి అని..సార పాతదే కానీ సీసా కొత్తదన్నట్లుగా దాన్ని తీరు ఉందన్నారు. కేసీఆర్ ఉండవల్లిని కలవడం తెలంగాణ సమాజం సహించదని..అరుణ్ కుమార్ కూడా కేసీఆర్ గురించి అన్ని వాస్తవాలు తెలసుకుని  వ్యవహరించడం మంచిందని హితవు పలికారు.