పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు

పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు

హైదరాబాద్​కు వచ్చిన యశ్వంత్​ సిన్హాను ఎవరైనా కలిస్తే వాళ్లను గోడకేసి కొడ్తమని రేవంత్​ రెడ్డి సీరియస్​గా స్పందించారు. ఎంతటోడైనా ఆయనను కలువడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఈ మాటలు రాష్ట్ర కాంగ్రెస్​లో దుమారాన్నే సృష్టించాయి. యశ్వంత్​ టూర్​పై రేవంత్​ను మీడియా ప్రశ్నించింది. యశ్వంత్​ను కలువద్దని జాతీయ స్థాయి నేతలతో మాట్లాడి నిర్ణ యం తీసుకున్నామని ఆయన అన్నారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే తీవ్రమైన చర్యలుంటాయని స్పష్టంచేశారు. యశ్వంత్​ సిన్హా నామినేషన్​ వేసే సమయంలో కేటీఆర్, రాహుల్​ పక్కనే ఉన్న విషయాన్ని మీడియా ప్రస్తావించగా.. ‘‘రాహుల్​ తన పక్కన ఉన్నది కేటీఆరో, ఏ గొట్టంగాడో గుర్తుపట్టరు. కేటీఆర్​ను ఢిల్లీలోనే కాదు గల్లీలో తిరిగినా ఎవరూ గుర్తుపట్టరు” అని రేవంత్​ కామెంట్​ చేశారు.

క్రమశిక్షణ కాపాడేందుకే.. మల్లు రవి
పార్టీలో క్రమశిక్షణ కాపాడేందుకే రేవంత్​రెడ్డి మాట్లాడాల్సి వచ్చిందని పీసీసీ సీనియ ర్‌‌‌‌ వైస్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ మల్లు రవి అన్నారు. రేవంత్‌‌‌‌ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి బహిరంగంగా మాట్లాడటం క్రమశిక్షణారాహిత్యంమని అన్నారు. జగ్గారెడ్డికి పార్టీ అంతర్గత వేదికలపై మాట్లాడే అవకాశం ఉన్నా ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌ పెట్టి మాట్లాడటంతో శత్రువులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందన్నారు.