పెద్దపల్లి జిల్లాలోని 1.07 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి

పెద్దపల్లి జిల్లాలోని 1.07 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి
  •     ఆర్ఎఫ్​సీఎల్​ సిబ్బందికి యాజమాన్యం అభినందనలు

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫర్టిలైజర్స్, కెమికల్స్​లిమిటెడ్ (ఆర్ఎఫ్​సీఎల్) మే నెలలో 1,07,883 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసింది. ఇందులో తెలంగాణకు 64,299.15 మెట్రిక్ టన్నులు, ఏపీకి 8,175.15 మెట్రిక్ టన్నులు, కర్నాటకకు 11,305.26 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 7,900.47 మెట్రిక్ టన్నులు, మహారాష్ట్రకు 8,291.07 మెట్రిక్ టన్నులు, చత్తీస్​గఢ్​కు 7,912.35 మెట్రిక్ టన్నులు సప్లై చేశారు. 

యూరియా ఉత్పత్తిలో కీలకపాత్ర పోషించిన కార్మికులు, ఉద్యోగులను ప్లాంట్ హెడ్ ఎస్.కె.జిందాల్ అభినందించారు. ఆర్ఎఫ్​సీఎల్ ప్లాంట్​లో డెన్మార్క్​కు చెందిన హల్దర్ టాప్స్ కంపెనీ రూ.200 కోట్లతో హై టెంపరేచర్ రీఫార్మర్ (హెచ్ టీఆర్) మెషీన్​ను ఏర్పాటు చేసింది. గత జనవరిలో ఈ మెషీన్ ఫెయిల్ కావడంతో రిపేర్ల కోసం మార్చి 25న ముంబైకి తరలించారు. మెషీన్ పనిచేయకపోవడంతో యూరియా ఉత్పత్తి రోజుకు 3,850 నుంచి 3,200 మెట్రిక్​ టన్నులకు పడిపోయింది. ఈ ప్రభావం వానాకాలం సీజన్​పై పడనుంది.