
ప్యాన్ ఇండియా స్టార్ అనే ఇమేజ్‌ని తెచ్చుకోవడమే కాదు.. ఆ స్థాయి భారీ చిత్రాలతో బిజీ అయ్యాడు ప్రభాస్. గత రెండు చిత్రాలూ నిరాశ పర్చినప్పటికీ అతని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో ‘ఆదిపురుష్’ షూట్ పూర్తయింది. ప్రాజెక్ట్ కె, సాలార్ చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ‘సాలార్’ మూవీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ, షూటింగ్‌ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు ప్రభాస్. ఇప్పటికే కొంత తీశారు. ఇటీవల మరో కొత్త షెడ్యూల్ మొదలైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో డే అండ్ నైట్ షూట్ జరుగుతోంది. అర్థరాత్రి వరకు షూటింగ్‌లో పాల్గొంటున్నాడు ప్రభాస్. ఈ షెడ్యూల్‌లో మూడు హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ తీస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాకి ఇవి హైలైట్ అంటున్నారు. శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. జగపతిబాబుతో పాటు మలయాళ స్టార్ పృథ్విరాజ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రభాస్ సినిమాలకి రెగ్యులర్‌గా ఉండే క్రేజ్‌తో పాటు, ప్రశాంత్ నీల్ రీసెంట్ మూవీ ‘కేజీయఫ్2’ భారీ విజయం సాధించడంతో ‘సాలార్’పై అంచనాలు మరింత పెరిగాయి.