మందులతో నదులు కలుషితం

మందులతో నదులు కలుషితం

జబ్బు చేస్తే మందులేసుకుంటాం . అందంగా కనిపించేందుకు క్రీములు రాసుకుంటాం . అవన్నీ మనకు మేలు చేస్తున్నాయని అనుకుంటున్నాం . కానీ, అవే పర్యావరణాన్నీ పాడు చేస్తున్నాయని తెలుసా? వాటిఅవశేషాలు నదులు, సముద్రాల్లో కలుస్తూ నీటిని కలుషితం చేస్తున్నాయని తెలుసా? అమెరికాలో ని రట్గర్స్​ యూనివర్సిటీ సైంటిస్టులు అదే చెబుతున్నారు. మురుగు వ్యర్థాల ప్లాంట్లలో ని ఓ బ్యాక్టీరియా.. మందులు, కాస్మె టిక్ లలో వాడే రసాయనాలతో కలిసి కొత్త రకం కాలుష్య కారకాలను తయారు చేస్తున్నట్ టు గుర్తించారు. అలా కొత్తగా పుట్టుకొచ్చిన కాలుష్య కారకాలు వివిధ మార్గాల ద్వారా నదులు, సముద్రాల్లో కలుస్తూ నీటిని కలుషితం చేస్తున్నాయని తేల్చారు.