
పెళ్లికి వెళ్లి వస్తున్న ఓ టాటా ఏసీ వ్యాన్ బోల్తాపడి 20 మందికి గాయాలయ్యాయి. ఇందులో 6గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలోని కుబీర్ మండలంలో జరిగింది. వీరు ఫంగ్రా గ్రామంలో జరిగిన పెండ్లికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులంతా మహారాష్ట్ర లోని బోకర్ తాలూకాకు చెందిన వారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని గాయపడిన వారిని భైంసా హాస్పిటల్ కు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో నిజమాబాద్ దవాఖానాకు తీసుకెళ్లారు. .