సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఓఆర్అర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి జంక్షన్ దగ్గర ఆగి ఉన్న మినీ పెట్రోల్ ట్యాంకర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో డీసీఎం క్యాబిన్లో ఉన్న ఇద్దరు కూలీలు మృతి చెందారు. డ్రైవర్ కు తీవ్ర గాయాలు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు డీసీఎం క్యాబిన్లో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీశారు. గాయాలైన డ్రైవర్లను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
