V6 News

వింబుల్డన్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి రోజర్ ఫెదరర్

వింబుల్డన్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి రోజర్ ఫెదరర్

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సోమ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో ఫెద‌ర‌ర్ 7-5, 6-4, 6-2 స్కోర్ తేడాతో ఇట‌లీకి చెందిన లోరెంజో సొనేగాపై ఈజీగా విక్టరీ సాధించాడు. 39 ఏళ్ల రోజ‌ర్ ఈ టోర్నీలో ఆర‌వ సీడ్‌గా బ‌రిలోకి దిగాడు. ఈ క్రమంలో అతను వింబుల్డన్‌లో రికార్డు స్థాయిలో 18వ సారి క్వార్టర్స్‌కు చేరాడు. ఫెదరర్‌ తన తర్వాతి మ్యాచ్‌లో డానియల్ మెద్వెదెవ్ లేదా హుబెర్ట్ హుర్కాజ్తో తలపడే అవకాశం ఉంది.

1968లో ఓపెన్ ఎరా ప్రారంభమైనప్పటి నుంచి వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న అతి పెద్ద వయసు ఆటగాడిగా ఫెదరర్‌ రికార్డు రికార్డు సృష్టించాడు.