MI vs RR: రోహిత్ శర్మ చెత్త రికార్డు.. దినేశ్ కార్తీక్ తో సమానంగా

 MI vs RR: రోహిత్ శర్మ చెత్త రికార్డు..  దినేశ్ కార్తీక్ తో సమానంగా

వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్ గా వెనుదిరిగాడు. బౌల్డ్ వేసిన ఐదో బంతిని ఆడబోయిన రోహిత్ సంజూ శాంసన్ కు చిక్కాడు.  దీంతో ఐపీఎల్ లో  ఓ చెత్త రికార్డును సమం చేశాడు. ఐపీఎల్ లో  ఎక్కువసార్లు డకౌట్ అయిన ప్లేయర్ గా దినేశ్ కార్తీక్ సరసన చేరాడు. దినేశ్ కార్తీక్ ఇప్పటి వరకు 17 సార్లు డకౌట్ కాగా తాజాగా అతని సరసన రోహిత్ చేరాడు. 

అయితే వీరిద్దరిలో రోహిత్ ఎక్కువ ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాడు.  ఐపీఎల్‌లో రోహిత్ శర్మకు ఇది 246వ మ్యాచ్ కాగా...  ఇప్పటివరకు కార్తీక్  245 మ్యాచ్ లు ఆడాడు.  ఇక వీరి తరువాతి స్థానాల్లో  గ్లెన్ మాక్స్‌వెల్, పీయూష్ చావ్లా, మన్‌దీప్ సింగ్, సునీల్ నరైన్ 15 సార్లు డకౌట్ అయ్యారు.

ఐపీఎల్‌లో ఎక్కువ సార్లు డకౌట్‌ అయిన ఆటగాళ్లు

  • 17 - రోహిత్ శర్మ
  • 17 - దినేష్ కార్తీక్
  • 15 - గ్లెన్ మాక్స్‌వెల్
  • 15 - పీయూష్ చావ్లా
  • 15 - మన్‌దీప్ సింగ్
  • 15 - సునీల్ నరైన్