హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఫుడ్ క్వాలిటీపై పెను వివాదం చెలరేగింది. ప్రముఖ రెస్టారెంట్ ‘తెలుగు మీడియం కిచెన్ లో రుచికరమైన భోజనం కోసం వెళ్లిన ఒక కస్టమర్‌కు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. తినడానికి ఆర్డర్ ఇచ్చిన మటన్ కూర నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో కస్టమర్ షాక్‌కు గురయ్యారు. అది కుళ్ళిపోయిన మటన్ అని గుర్తించిన బాధితుడు రెస్టారెంట్ యాజమాన్యాన్ని నిలదీశారు.
రెస్టారెంట్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కస్టమర్, వెంటనే పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి రెస్టారెంట్ మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
►ALSO READ | హైదరాబాద్ లో హాల్ టికెట్ ఇవ్వలేదని.. బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య
ప్రస్తుతం మేనేజర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. నాణ్యత లేని నిల్వ ఉంచిన మాంసాన్ని కస్టమర్లకు ఎలా సర్వ్ చేస్తారని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రెస్టారెంట్ నిర్వహణపై పూర్తి స్థాయి దర్యాప్తును ప్రారంభించారు అధికారులు.
ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఇలాంటి హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

