అడ్వకేట్ల సంక్షేమానికి మరో రూ.200 కోట్లివ్వాలి.. బీఆర్ఎస్​ లీగల్​ సెల్​ సమావేశంలో తీర్మానం

అడ్వకేట్ల సంక్షేమానికి మరో రూ.200 కోట్లివ్వాలి.. బీఆర్ఎస్​ లీగల్​ సెల్​ సమావేశంలో తీర్మానం

హైదరాబాద్, వెలుగు:  అడ్వకేట్ల సంక్షేమం కోసం గతంలో ఇచ్చిన రూ.100 కోట్ల నిధులకు అదనంగా మరో రూ.200 కోట్లు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్​లీగల్​సెల్​తీర్మానం చేసింది. శనివారం తెలంగాణ భవన్​లో డెయిరీ డెవలప్​మెంట్​కార్పొరేషన్​చైర్మన్​సోమ భరత్​కుమార్​అధ్యక్షతన బీఆర్ఎస్​లీగల్​సెల్​సమావేశం జరిగింది. దీనికి ప్లానింగ్​బోర్డు వైస్​చైర్మన్​వినోద్​కుమార్​సహా పలువురు నేతలు హాజరయ్యారు. అడ్వకేట్ల  సమస్యల పరిష్కారం కోసం పలు తీర్మానాలు చేశారు. 

కొత్తగా మరో10 వేల మంది అడ్వకేట్లకు హెల్త్​ఇన్సూరెన్స్​వర్తింపజేయాలని తీర్మానించారు. అడ్వకేట్లకు ఇండ్ల స్థలాలు, టెన్యూర్​పీపీల కొనసాగింపు, పీపీ, జీపీ, ఏజీపీల సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా వినోద్​కుమార్ మాట్లాడుతూ..ఈ తీర్మానాలను సీఎం కేసీఆర్​దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్​ప్రభుత్వానికి, బీఆర్ఎస్​పార్టీకి వచ్చే ఎన్నికల్లో అడ్వకేట్ల అండగా నిలవాలని కోరారు.  సమావేశంలో సీనియర్​అడ్వకేట్ల గండ్ర మోహన్​రావు, సహోదర రెడ్డి, గణేశ్, తిరుమల రావు, వెంకటేశ్వర్లు, దేవేందర్​రెడ్డి, రమణారెడ్డి, అంజయ్య, రాజ్​కుమార్, మధుసూదన్​ రావు, కళ్యాణ్​రావు, లలితా రెడ్డి, రాజేశ్వర్​రావు తదితరులు పాల్గొన్నారు.