సంజయ్ కొడుకుపై పీడీ యాక్ట్‌‌‌‌‌‌‌‌ పెట్టాలి ..ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్

సంజయ్ కొడుకుపై పీడీ యాక్ట్‌‌‌‌‌‌‌‌ పెట్టాలి ..ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ఓ మైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్​ కుమారుడు అఘాయిత్యానికి పాల్పడితే.. ఆ అమ్మాయి తల్లి ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదని ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరోపించారు.  సాయి భగీరథ్‌‌‌‌‌‌‌‌పై పీడీ యాక్ట్​ పెట్టి అరెస్ట్​చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు.  మహీంద్ర యూనివర్సిటీలో బండి సాయి భగీరథ్​పై రెండు కేసులు నమోదయ్యాయని చెప్పారు.

శనివారం తెలంగాణభవన్‌‌‌‌‌‌‌‌లో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌‌‌‌‌కుమార్​ మీడియాతో మాట్లాడారు. మైనర్​ తల్లి 8 గంటలు పేట్​బషీర్​బాద్​ పోలీస్​ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఉన్నా పోలీసులు స్పందించలేదని పేర్కొన్నారు. సంజయ్​, రేవంత్, కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డికి అవినాభావ సంబంధం ఉందనే పోలీసులు పట్టించుకోవడం లేదా? అని ప్రశ్నించారు.