సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు బైకర్ పైకి దూసుకెళ్లడంతో బండితో సహా ఇరుక్కుపోయాడు బైకర్. బుధవారం ( జూన్ 3 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర బస్సు యూటర్న్ తీసుకుంటుండగా ఓ వాహనదారుడు బస్సును ఢీకొట్టడంతో అతడు బస్సు కిందికి వెళ్ళిపోయాడు.
మారేడ్ పల్లి పోలీసులు, బాటసారులు, ప్రయాణికులు వాహనదారుడిని కాపాడారు. బైక్ తో సహా వాహనదారుడు బస్సు కింద ఇరుక్కుపోవడంతో చాలా సేపు శ్రమించి బయటికి తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
