సీజేఐ ఆదేశాలతో బస్సు పునరుద్ధరణ

సీజేఐ ఆదేశాలతో బస్సు పునరుద్ధరణ
  • సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసిన 8వ తరగతి బాలిక
  • లేఖను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు పంపిన సీజేఐ
  • వెంటనే బస్సు పునరుద్ధరించిన సజ్జనార్
  • కాలేజీలు, స్కూల్ టైమింగ్స్ కు అనుగుణంగా బస్సులు నడుపుతామన్న ఆర్టీసీ ఎండీ
  • టైంకు బస్సులు కావాలంటే ఫోన్ నెంబర్లు: 040-30102829, 6815333
  • @tsrtcmdoffice కు కూడా ట్వీట్ చేయండి: ఆర్టీసీ ఎండీ సజ్జనార్

హైదరాబాద్, వెలుగు: సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ ఆదేశాలతో ఆర్టీసీ అధికారులు బస్సును పునరుద్ధరించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చీడేడ్​కు చెందిన  చెందిన 8వ తరగతి విద్యార్థిని వైష్ణవి తమ గ్రామానికి బస్సు రావడం లేదని, పునరుద్ధరించేలా ఆదేశించాలని ఇటీవల సీజేఐకి లేఖ రాసింది. ఆటో చార్జీలు భరించలేకపోతున్నామని, కొవిడ్‌ టైంలో తన తండ్రి గుండెపోటుతో చనిపోయారని లేఖలో తెలిపింది.

దీంతో బస్సు సర్వీసు పునరుద్ధరించాలని ఆర్టీసీని సీజేఐ ఆదేశించారు. విద్యార్థులతో సహా, ప్రజలు తమ గ్రామాలకు ఆర్టీసీ బస్సులనుపునరుద్ధరించడానికి డిపో మేనేజర్‌ను, కస్టమర్‌ సపోర్ట్‌ టీం 040 30102829, 040 6815333 నంబర్లలో సంప్రదించాలని ఎండీ సజ్జనార్‌ కోరారు.