
సరుకుల రవాణా ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ఆర్టీసీ కార్గో బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా బస్సుల బాడీ బిల్డింగ్ లో పలు మార్పులు చేసి కార్గో సర్వీసులుగా రూపొందిస్తున్నారు. కొత్త ఏడాది మొదటి వారంలో వీటి సేవలను ప్రారంభించనున్నారు. కార్గో సర్వీసులుగా మారే బస్సుల్లో 90 శాతం గ్రేటర్ ఆర్టీసీ జోన్ పరిధిలోనివే.