డీజిల్ రేట్లు తగ్గించాలని నిరసనకు దిగిన ఆర్టీసీ ఉద్యోగులు

డీజిల్ రేట్లు తగ్గించాలని నిరసనకు దిగిన ఆర్టీసీ ఉద్యోగులు

హైదరాబాద్: డీజిల్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా  ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు డిపోల దగ్గర నిరసనకు దిగారు. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఆర్టీసీ కార్మికులు.. కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు ఆర్టీసీకి లీటర్ పై 8 రూపాయలు పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎల్ బీ నగర్ లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ కేంద్రకమిటీ సమావేశం నిర్వహించించారు. ఈ సమావేశంలో టీఎమ్యూ అధ్యక్షుడు తిరుపతి, ప్రధాన కార్యదర్శి ఏఆర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ  సందర్భంగా టీఎమ్యూ అధ్యక్షుడు తిరుపతి మాట్లాడుతూ.. డీజిల్ రేట్లు అమాంతం పెరగడంతో ఆర్టీసీకి తీరని నష్టం ఏర్పడిందని, దీంతో ఈ భారం ఆర్టీసీ కార్మికులపై పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ చరిత్రలో ఏనాడు ఇలాంటి దుస్థితి తలెత్తలేదని, కార్మికులపై విపరీతమైన పనిభారం మోపుతున్నారన్నారు. టీఎమ్యూ ప్రధాన కార్యదర్శి ఏఆర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల జీతాలు పెంచాలని ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎంతో ఉందన్నారు. కానీ ప్రభుత్వానికి తమ సమస్యలు పట్టడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని  కోరారు.

మరికొన్ని వార్తల కోసం:

శభాష్​ నిఖత్‌.. ఇండియన్​గా చరిత్ర

రాజన్న టెంపుల్ కు ఉచిత బస్సు సర్వీస్