హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ వీఎస్టీ దగ్గర్లోని ఆర్టీసీ కళా భవన్‌ను ఆర్టీసీ అధికారులు గురువారం సీజ్ చేశారు. కళాభవన్‌ను 2016లో సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు లీజుకు ఇచ్చింది. ఆ భవన్‌లో కల్యాణ మండపం, కళా భవన్, మరో 3 మినీ హాళ్లు లీజ్‌కు తీసుకుంటూ ఒప్పందం కుదుర్చుకుంది.
ఆ ఒప్పందం ప్రకారం నెలకు రూ.25.16 లక్షలను టీఎస్‌ఆర్టీసీకి సుచిరిండియా హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెల్లించా లి. కొంత కాలంగా అద్దె సకాలంలో చెల్లించకపోవడంతో రూ.6.55 కోట్ల బకాయిలు పేరుకుపోయా యి. పెండింగ్ బకాయిలను చెల్లించాలని అధికారు లు సుచిరిండియాకు నోటీసులిచ్చింది. వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఒప్పందం ప్రకారం, భవన్‌ను సీజ్ చేశామని అధికారులు వెల్లడించారు.
