
విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి ఉన్నతంగా రాణించాలని ఆమెకు సూచించారు. శివాని మేనమామ ప్రకాశ్ రావు ఆర్టీసీలో డీఎం హోదాలో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం బస్‌భవన్‌కు వచ్చి సజ్జనార్‌ను ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శివానితో ఆమె తల్లిదండ్రులు రాజు, రజితను సజ్జనార్ సత్కరించారు.
అకీరా నందన్‌కు అభినందన
మొరాకోలో ఇటీవల జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ టోర్నీలో కూకట్‌పల్లి డిపోకు చెందిన బస్ కండక్టర్ బానోత్ మోహన్ కుమారుడు అకీరా నందన్ సత్తా చాటాడు. 400 మీటర్ల పరుగును 53.07 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకం సాధించాడు. 200 మీటర్ల పరుగులోనూ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గురువారం బస్‌భవన్‌లోని తన చాంబర్‌లో అకీరా నందన్‌ను సన్మానించారు. కుమారుడిని క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తోన్న కండక్టర్ మోహన్ దంపతులను అభినందించారు.