V6 News

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తం : మంత్రి పొన్నం ప్రభాకర్  

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తం : మంత్రి పొన్నం ప్రభాకర్  

ఆమనగల్లు, వెలుగు: ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న మంత్రికి రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చారిత్రాత్మక నిర్ణయం అని, విలీనం ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని చెప్పారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా పెరిగిన రద్దీకి అనుగుణంగా అన్ని రూట్లలో బస్సుల సంఖ్య పెంచామన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వినతి మేరకు కల్వకుర్తి డిపోకు 20 కొత్త బస్సులను కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, విపక్షాల అసత్య ప్రచారాన్ని ఎండగట్టాలని సూచించారు. కార్యక్రమంలో బ్లాక్‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు యాట నరసింహ, నాయకులు షాబుద్దీన్ పాల్గొన్నారు.