భీమదేవరపల్లి/ ఎల్కతుర్తి/ ఖమ్మం టౌన్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించి, పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కార్మికులు సమ్మె విరమించారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పలుచోట్లఆర్టీసీ కార్మికులు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్, ఎల్కతుర్తి మండల కేంద్రంలో, ఖమ్మం టౌన్ డిపో ఎదుట క్షీరాభిషేకం చేసి, స్వీట్లు పంచిపెట్టారు. ఆర్టీసీ కార్మికులు, కాంగ్రెస్శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

