యునైటెడ్ నేషన్స్: పర్షియన్ గల్ఫ్‌ను గల్ఫ్ ఆఫ్ ఒమన్‌తో కలిపే వ్యూహాత్మక హార్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణకు రష్యా అధికారికంగా మద్దతు తెలిపింది. హార్మూజ్ జలసంధిని నియంత్రించే హక్కు ఇరాన్‌కు ఉందని ఐక్యరాజ్యసమితిలో రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా అన్నారు. పశ్చిమ దేశాలు సముద్రపు దొంగల్లా వ్యవహరిస్తూ, కపటత్వం ప్రదర్శిస్తున్నాయని ఆయన విమర్శించారు.
హార్మూజ్ లో రాకపోకలను పరిమితం చేయడంతోపాటు జలసంధిని పూర్తిగా నియంత్రించే పూర్తి హక్కు ఇరాన్‌కు ఉందన్నారు. "ఇరాన్ తన పొరుగు దేశాలపై దాడి చేసినట్లుగా, పూర్తి బాధ్యతను ఆ దేశంపై నెట్టడానికి ప్రయత్నం జరిగింది. యుద్ధ సమయంలో, దాడికి గురైన తీరప్రాంత దేశం భద్రత కోసం తన ప్రాంతీయ జలాల్లో నౌకాయానాన్ని పరిమితం చేయవచ్చు" అని నెబెంజియా స్పష్టం చేశారు.

