V6 News

తెలంగాణలో ఎక్కడెక్కడ పెట్రోల్, డీజిల్ దొరకడం లేదంటే..

తెలంగాణలో ఎక్కడెక్కడ పెట్రోల్, డీజిల్ దొరకడం లేదంటే..

హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. భద్రాద్రి, వనపర్తి, కామారెడ్డి జిల్లాలతో పాటు పలు చోట్ల బంక్‌‌‌‌ల వద్ద నో స్టాక్‌‌‌‌ బోర్డులు కనిపిస్తుండగా.. స్టాక్‌‌‌‌ ఉన్న బంకుల వద్ద వాహనదారులు బారులుదీరుతున్నారు. యాసంగి సీజన్‌‌‌‌ వరి కోతలు ప్రారంభం కావడంతో హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, ఇతర వాహనదారులు డీజిల్‌‌‌‌ కోసం క్యాన్లతో బంక్‌‌‌‌ల వద్ద పడిగాపులు పడుతున్నారు. వనపర్తి జిల్లాలోని మూడు, నాలుగు మండలాలు మినహా మిగతా 11 మండలాల్లో డీజిల్‌‌‌‌ దొరకడం లేదు. కొన్ని బంక్‌‌‌‌ల వద్ద బైక్‌‌‌‌లకు రూ. 100కు మించి పెట్రోల్‌‌‌‌ పోయడం లేదు.

అలాగే కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు బాన్సువాడ, భిక్కనూరు, పిట్లం ఏరియాలోని బంక్‌‌‌‌ల వద్ద నోస్టాక్‌‌‌‌ బోర్డులు కనిపిస్తున్నాయి. క్యాన్లలో పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌ పోయొద్దని ఆఫీసర్లు హెచ్చరిస్తున్నా భద్రాద్రి జిల్లాలోని కొన్ని బంక్‌‌‌‌ల యజమానులు మాత్రం పట్టించుకోవడం లేదు. బైక్‌‌‌‌లు, ఇతర వాహనాలపై వచ్చిన వారిని పక్కన పెట్టి క్యాన్లు తెచ్చుకున్న వారికే పెట్రోల్, డీజిల్‌‌‌‌ పోస్తుండడంతో పలు చోట్ల వాహనదారులు సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. క్యాన్లలో పెట్రోల్‌‌‌‌ తీసుకెళ్తున్న వారు రూ. 160కి లీటర్‌‌‌‌ అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో డీజిల్ కొరత

* పలు పెట్రోల్ బంకుల్లో “నో స్టాక్” బోర్డులు
* డీజిల్ కొరతతో వాహనదారుల తీవ్ర ఇబ్బందులు
* బంకుల దగ్గర "నో స్టాక్" బోర్డు చూసి నిరాశతో వెనుదిరుగుతున్న వాహన దారులు
* కొన్ని బంకుల్లో డీజిల్ ఉన్నా కొన్ని గంటల్లోనే  స్టాక్ అయిపోతోందని చెబుతున్న సిబ్బంది

జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న డీజిల్ టెన్షన్

* కోరుట్ల పట్టణంలో బంకుల్లో డీజిల్ పోసుకోవడానికి బారులు తీరిన వాహనాలు 
* కొన్నిచోట్ల డీజిల్, పెట్రోల్ లేక అండర్ రిపేర్ అని బోర్డులు తగిలించిన యాజమాన్యం

నిర్మల్ జిల్లా కుబీర్లో పెట్రోల్ కోసం ఎగబడుతున్న వాహనదారులు

* ట్యాంకర్ వచ్చిందని తెలియగానే భారీగా చేరుకున్న వాహనదారులు
* వందల్లో బంకుకు చేరుకున్న వాహనదారులు
* వాహనదారుల రాకతో జాతరను తలపిస్తున్న పెట్రోల్ బంకు
* రోజుకు మూడు వేల లీటర్లు అమ్మే బంకులు
* పెట్రోల్ కొరతతో పదకొండు వేల లీటర్ల అమ్మకాలు సాగుతుందంటున్న నిర్వాహకులు
* ట్యాంకర్ వస్తే గంటలో ఖాళీ అవుతుందంటున్న నిర్వాహకులు
* కొరత భయంతో భారీగా పెట్రోల్ కొనుగోలు చేస్తున్న వాహనదారులు
* మరికొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు
* పెట్రోల్, డీజిల్ కొరతను తీర్చాలంటున్న వినియోగదారులు

మహబూబాబాద్ జిల్లాలో పరిస్థితి ఏంటంటే..

* డీజిల్, పెట్రోల్ కోసం మహబూబాబాద్, కేసముద్రం, బయ్యారంలో బారులు తీరిన వాహనదారులు
* మహబూబాబాద్ పట్టణంలోని అన్ని  బంకుల ముందు నో స్టాక్ బోర్డులు
* బంకుల ముందు రాత్రింబవళ్లు నిద్ర పోకుండా డీజిల్, పెట్రోల్ కోసం వాహనదారుల పడిగాపులు
* మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ
* డీజిల్, పెట్రోల్ కోసం బంకుల దగ్గర వాహనాదారులు రద్దీ.. తోపులాట
* వాహనదారులను కంట్రోల్ చేయలేక నానా అవస్థలు పడుతున్న పోలీసులు 
* కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. బంకుల దగ్గర క్యూలో పెద్ద పెద్ద క్యాన్లు
* డీజిల్ లేక ఐదు రోజుల నుంచి  నిలిచిపోయిన కోత మిషన్లు, ట్రాక్టర్లు, లారీలు
* డీజిల్ కొరతతో ఇబ్బందుల పడుతున్న వరి, మొక్కజొన్న  రైతులు