ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత్తికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా లేదు. ఒకవైపు అమెరికా-ఇరాన్ యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతుంటే.. ఆ యుద్ధానికి కాస్త బ్రేక్ పడిందో లేదో.. అంతలోనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ ఊపందుకుంది. ఒకదేశంపై మరొకటి డ్రోన్లతో విరుచుకుపడటంతో పీక్స్ చేరినట్లైంది.
2026 ఏప్రిల్ 29 న ఇరు దేశాలు కయ్యానికి కాలు దువ్వి.. ఘోర విధ్వంసానికి పాల్పడ్డాయి. రష్యా ఆయిల్ ఫెసిలిటీపై ఉక్రెయిన్ డ్రోన్ అటాక్ చేసింది. అత్యంత దూరంలో ఉన్న టార్గెట్ ధ్వసం చేయడం ఈ మధ్యకాలంలో ఇదే లేటెస్ట్ అని ఉక్రెయిన్ ప్రసిడెంట్ ప్రకటించారు. రష్యాలోని పెర్మ్ సిటీ సమీపంలో ఉన్న ఆయిల్ ఫెసిలిటీ ధ్వంసం అయినట్లు జెలెన్ స్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో ఉండటం గమనార్హం.
నల్ల సముంద్రం (బ్లాక్ సీ) ఏరియాలో ఉన్న రష్యా ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడితో ధ్వంసం అయ్యింది. భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో ఆ ప్రాంతమంతా భయంకరంగా మారింది. ఉక్రెయిన్ దాడితో పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. 160కి పైగా అగ్నిమాప సిబ్బంది రిఫైనరీలో మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి దిగినట్లు క్రాస్నోడార్ గవర్నర్ పేర్కొన్నారు.
ఉక్రెయిన్ దాడితో ప్రపంచంలో ఆయిల్ కొరత మరింత అధికం అవుతుందని రష్యా అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.
మరోవైపు ఉక్రెయిన్ పై 24 గంటల్లో 19 సార్లు డ్రోన్లు, బాంబు దాడులు చేసింది రష్యా. ఈ దాడుల్లో దాదాపు ముగ్గురు మృతి చెందగా.. 17 మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ లోని డొనెట్స్క్ ఏరియాలో ఈ దాడులు జరిగినట్లు మిలిటరీ హెడ్ వదీమ్ ఫిలాష్కిన్ పేర్కొన్నారు.
డొనెట్స్క్ మిలిటరీ ప్రాంతంలో జరిగిన దాడిలో డజన్ల కొద్దీ ఇండ్లు, అపార్టుమెంట్లు, మినీ బస్సులు, ఇన్ ఫ్రా దెబ్బతిన్నట్లు తెలిపారు. మరోవైపు నార్త్ ఈస్ట్ ఉక్రెయిన్ బార్డరన్ లోని సుమీ ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడిలో ఒక మహిళ మృతి చెందింది. అర్థరాత్రి ఉక్రెయిన్ లోని ఒదేస ప్రాంతంపై రష్యా చేసిన దాడిలో పలు హాస్పిటల్స్ ధ్వంసమయ్యాయి.

