గోపీచంద్ కొడుకు ఫస్ట్ బర్త్ డే వేడుకలో సాహో

గోపీచంద్ కొడుకు ఫస్ట్ బర్త్ డే వేడుకలో సాహో

హైదరాబాద్ : సినిమా హీరో గోపీచంద్ రెండో కొడుకు వియాన్ ఫస్ట్ బర్త్ డే గ్రాండ్ గా జరిగింది. స్టార్ హీరోల ప్రెజెన్స్, కళ్లుచెదిరే డెకరేషన్ … సెలబ్రేషన్స్ కు వచ్చినవారిని అందరినీ ఆకట్టుకున్నాయి.

సాహో ప్రభాస్ సహా… టాలీవుడ్ లోని క్రేజీ హీరోలు, హీరోయిన్లు, నటీనటులు, గోపీచంద్ తో కలిసి పనిచేసిన టెక్నీషియన్స్ చాలామంది వియాన్ బర్త్ డే వేడుకకు వచ్చారు. ఫొటోలకు పోజులిచ్చారు.

సాహో ప్రభాస్, గోపీచంద్ బెస్ట్ ఫ్రెండ్స్. వియాన్ బర్త్ డే ఈవెంట్ లో వీళ్లిద్దరూ చాలామందిని ఆకట్టుకున్నారు. ఆరడుగులు హైట్… మంచి ఫిజిక్ తో.. మ్యాచో ఇమేజ్ ఉన్న హ్యాండ్సమ్ హీరోలు వీళ్లు. వర్షం సినిమాలో వీరిద్దరి నటన ఇప్పటికీ ఎవర్ గ్రీన్. సాహో కమర్షియల్ సక్సెస్ ఈవెంట్లతో బిజీగా ఉన్నా కూడా ప్రభాస్… గోపీచంద్ కొడుకు బర్త్ డేకి వచ్చాడు. వీరిద్దరి మధ్యఉన్న ఫ్రెండ్ షిప్ కు ఇది ఓ ఎగ్జాంపుల్ అని అక్కడికి వచ్చినవారు చెప్పుకున్నారు.

అల్లు అర్జున్, హీరో రామ్, మంచు విష్ణు, BVSN ప్రసాద్, తేజ, సంపత్ నంది, వంశీ పైడిపల్లి, బోయపాటి శ్రీను, కేఎస్ రామారావు, బంధువు శ్రీకాంత్, ఇలా.. చాలామంది హాజరయ్యారు.