- మోడల్స్కూళ్లలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో చేరే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల కోసం విద్యాశాఖ కొత్త కోర్సును అందుబాటులోకి తీసుకురానుంది. వచ్చే విద్యాసంవత్సరం(2026-–27) నుంచి మొత్తం 194 మోడల్ స్కూళ్లలో ఏసీఈ(అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
ప్రస్తుతం ఏ స్కూల్లోనూ ఎంఈసీ(మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్)లో పెద్దగా అడ్మిషన్లు రావడం లేదు. మ్యాథ్స్, కామర్స్ రెండూ పెద్ద సబ్జెక్టులు ఉండటంతో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ కోర్సును పూర్తిగా ఎత్తేసి, దాని స్థానంలో ఏసీఈని ప్రారంభిస్తే బాగుంటుందని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు భావించారు. ఈ విషయమై ఇంటర్ బోర్డు అధికారులకు లేఖ రాయగా అనుమతి లభించింది.
