కాంగ్రెస్ కు సబితా గుడ్ బై

కాంగ్రెస్ కు సబితా గుడ్ బై

మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. తన కుమారుడితో కలిసి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు. సబితా ఇంద్రారెడ్డి TRS లో చేరుతారని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. అయితే పార్టీ మారకుండా ఆమెను బుజ్జగించడానికి కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీలు చర్చలు జరిపారు. AICC అధ్యక్షులు రాహుల్ గాంధీతో కూడా ఫోన్లో కూడా మాట్లాడించారు. ఆమెను రాహుల్.. ఢిల్లీకి ఆహ్వానించారు.

ఈ క్రమంలో తమకు చేవెళ్ల ఎంపీ టికెట్‌ను తన తనయుడు కార్తిక్‌ రెడ్డికి ఇవ్వాలని సబితా డిమాండ్‌ చేసినట్లు సమాచారం. అయితే చేవెళ్ల సిట్టింగ్‌ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఇటీవలే టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. అంతేకాదు ఇప్పటికే ఆయన ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. దీంతో ఆయనకు అవకాశం కల్పించేందుకే కార్తిక్‌ రెడ్డికి టికెట్‌ నిరాకరించినట్లు తెలుస్తోంది.

దీంతో తన కుమారుడితో కలిసి కాంగ్రెస్ ను వీడి TRSలో చేరాలని సబితా ఇంద్రారెడ్డి నిర్ణయించుకున్నారు. ఇప్పటికే TRS నేతలతో సంప్రదింపులు జరిపారు. అంతేకాదు ఆమె రేపు (బుధవారం) TRSలో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.