
నాని హిట్ 3 మూవీ నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాను క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కించాడు. నాని కెరీర్‌లోనే మోస్ట్ వయలెంట్ మూవీగా వచ్చింది. ఈ మూవీకి థియేటర్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది.
అయితే, కొంతమంది సినిమాకు దూరంగా ఉండాలని సెన్సార్ బృందంతో పాటు ప్రేక్షకులు కూడా సూచిస్తున్నారు. మరి ఎవరు హిట్ 3 చూడాలి.? ఎవరు చూడకూడదు.. అసలెందుకు చూడకూడదు? అనే వివరాలు తెలుసుకుందాం.
సాధారణంగా నాని సినిమాలంటే సాఫ్ట్, సెన్సిటివ్, లవ్ స్టోరీస్ గుర్తొస్తాయి. వాటికి పూర్తి భిన్నంగా, మోస్ట్ వయలెంట్ క్రైమ్ జోనర్లో హిట్ 3 రూపొందింది. నాని ప్రమోషన్స్‌లో చెప్పినట్లు ఈ మూవీలో ఎక్కువ భాగం సీన్స్లో.. స్క్రీన్‌పై రక్తం ఏరులైపారుతుందని నెటిజన్స్ అంటున్నారు. అందువల్ల పిల్లలు, ఫ్యామిలీస్ సినిమాలోని రక్తపాతం, హింసను ఏ మాత్రం తట్టుకోవడం కష్టమని ప్రేక్షకులు సైతం చెబుతున్నారు. దానికి తోడు సినిమాలో బోల్డ్ డైలాగ్స్ కూడా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్కు అసౌకర్యంగా ఉంటుందని ఉంటున్నారు.
హిట్ 3 సెన్సార్:
హిట్ 3 మూవీకి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, పలు కండిషన్స్తో సర్టిఫికెట్ జారీ చేస్తూ సినిమాలో కొన్ని మార్పులు కూడా చేయాలని మూవీ టీమ్‌కి సూచించింది. అందులో హింస మరియు సబ్‌టైటిల్స్‌తో సహా ‘F’ వర్డ్స్‌ను తక్కువగా వినియోగించాలని, ఓ పదాన్ని మ్యూట్ చేయాలని చెప్పింది.
Also Read:-హిట్ 3 X రివ్యూ.. నాని మూవీకి పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?
‘‘పోలీస్ యూనిఫామ్ కాలిపోతున్న దృశ్యాల్ని మార్చాలని, కాళ్లు, చేతులు, వేళ్లను కట్ చేసే సీన్స్ లో ఫ్లాష్ తగ్గించాలని, రక్తం చిందే సీన్లలో రెడ్ కలర్‌ను డార్క్‌గా చేయాలని’’సెన్సార్ బోర్డు సూచించింది.
A for ARJUN SARKAAR
— Nani (@NameisNani) April 25, 2025
CERTIFIED. #HIT3 #HIT3FromMay1st pic.twitter.com/9PPKLwKEEJ
‘A’సర్టిఫికేట్:
ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాలను 18 సంవత్సరాలు పైబడిన పెద్దలు మాత్రమే చూడాలి. ఇటువంటి సినిమాల్లో ఎక్కువ హింసాత్మక దృశ్యాలు, పూర్తి నగ్నత్వం, దూషించే భాష అన్నీ ఉంటాయి.
‘A’సర్టిఫికేట్ జారీ చేయడం వల్ల ఈ సినిమాను చిన్నపిల్లలు చూడకూడదు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలను థియేటర్స్ యాజమాన్యం లోపలికి అనుమతించదు. ముందే ఈ విషయాన్ని గ్రహించి సినిమాకు వెళ్లేలా చూసుకోండి.
ఒక్కసారి ఫ్యామిలీతో వెళ్లాలని డిసైడ్ అయ్యి.. పిల్లలకు వయస్సు తక్కువ ఉన్న, పేరెంట్స్గా మేము పక్కనే ఉంటాం, టికెట్స్ బుక్ చేసుకుంటాం.. అనుకుంటే మాత్రం మీ డబ్బులు పోయినట్టే. అందువల్ల నానిని ఇష్టపడే చిన్నపిల్లలకు థియేటర్లలో హిట్ 3 చూసే అవకాశం లేనట్టే!