రాజకీయ ప్రస్థానం: మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ప్రమాణం

రాజకీయ ప్రస్థానం: మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ప్రమాణం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేబినెట్ లో తొలిసారి ఇద్దరు మహిళలు మంత్రులుగా పదవులు చేబట్టారు. ఇందులో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఒకరు. 2000 సంవత్సరంలో మొదటిసారి చేవేళ్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు. 2004లోనూ చేవేళ్ల నుంచి గెలుపొందిన సబిత.. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో మహేశ్వరం నుంచి పోటీ చేశారు. 2004 నుంచి 2009 మధ్య గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2009లో వైఎస్ కేబినెట్లో కీలకమైన హోంశాఖ బాధ్యతలు నిర్వహించారు. దేశంలో హోంశాఖ పదవి చేపట్టిన తొలి మహిళగా సబిత రికార్డు సృష్టించారు. 2014లో మహేశ్వరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన సబిత, 2018 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. ఇటీవలే కాంగ్రెస్ ను వీడి.. టీఆర్ఎస్ లో చేరిన సబితకు మంత్రిగా అవకాశం ఇచ్చారు కేసీఆర్.