V6 News

పదవి నుంచి తొలగించడంపై స్పందించిన సచిన్‌ పైలెట్‌

పదవి నుంచి తొలగించడంపై స్పందించిన సచిన్‌ పైలెట్‌
  • సత్యాన్ని ఓడించలేరంటూ ట్వీట్‌
  • సచిన్‌కు ఆహ్వానం పలికిన బీజేపీ

జైపూర్: ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై సచిన్‌పైలెట్‌ స్పందించారు. ‘సత్యాన్ని వక్రీకరించగలరేమో కానీ ఓడించలేరు” అంటూ సచిన్‌ పైలెట్‌ ట్వీట్‌ చేశారు. ఆయన రాజకీయ భవిష్యత్తుపై సాయంత్రం లోపు ప్రకటించే అవకాశంఉన్నట్లు తెలుస్తోంది. పార్టీపై చేసిన తిరుగుబాటు వల్ల సచిన్‌ను పదవి నుంచి తొలగిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటుమరో ఇద్దరు మంత్రులకు కూడా పార్టీ ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. సచిన్‌ పైలట్‌ను పీసీసీ నుంచి తొలగించిన అనంతరం నూతన అధ్యక్షుడిగా గోవింద్‌ సింగ్‌ దోతస్త్రాను నియమించారు.

పైలెట్‌కు ఆహ్వానం పలికిన బీజేపీ

రాజస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులపై బీజేపీ మొదటిసారి స్పందించింది. సచిన్‌ పైలెట్‌ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగిస్తూ కాంగ్రెస్‌ ప్రకటించిన వెంటనే బీజేపీ స్పందించింది. పైలెట్‌ను పార్టీలోకి ఆహ్వానించింది. ఈ మేరకు ఓం మథూర్‌‌ దీనిపై ప్రకటించారు. బీజేపీ విధానాలు నచ్చినవారు ఎవరైనా పార్టీలో చేరొచ్చని ఆయన ఈ సందర్భంగా అన్నారు.