V6 News

కొడుకుకు అమెజాన్ ఆఫర్ లెటర్.. చదువుతూ ఎమోషనల్ అయిన తండ్రి..వీడియో వైరల్

కొడుకుకు అమెజాన్ ఆఫర్ లెటర్.. చదువుతూ ఎమోషనల్ అయిన తండ్రి..వీడియో వైరల్

కొడుకు ఎదుగుదల కంటే తండ్రికి గొప్ప ఆనందం ఇంకేం ఉంటుంది. తాను కన్న కలను సాకారం చేస్తూ కొడుకు మంచి ప్రయోజకుడైతే చూసి మురిసిపోతారు పేరెంట్స్.కొడుకు సక్సెస్ తనదిగా ఫీల్ అవుతూ ఉప్పొంగిపోతారు. తండ్రి భావోద్వేగాలను చూపించే సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  కొడుకుకు ఉద్యోగం ఇస్తూ అమెజాన్ ఇచ్చిన ఆఫర్ లెటర్ ను చదువుతూ లోలోన భావోద్వాగానికి గురయిన తండ్రి వీడియో ఇప్పుడు నెటిజన్ల హార్ట్ ను దోచుకుంటోంది.. వివరాల్లోకి వెళితే.. 

కొన్నిసార్టు చాలా సాధారణ విషయాలే గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. అమెజాన్ టెక్ ఉద్యోగి తండ్రి తన కొడుకు ఆఫర్ లెటర్ చదివిన తీరు, భావోద్వేగానికి గురైన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. శైలేంద్ర యాదవ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ,సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్.. అందరి హృదయాలను దోచుకునే రీల్‌ను ఇన్ స్టాలో షేర్ చేశాడు. వీడియోతోపాటు  మానాన్న లెటర్ చదువుతున్నారు అని రాశారు.  పోస్ట్ చేసిన మరుక్షణమే లైకులు, కామెంట్లతో ముంచెత్తారు నెటిజన్లు. 

వైరల్ అవుతున్న వీడియో ఆ వ్యక్తి ఆఫర్ లెటర్ లోని ప్రతి అక్షరాన్ని అత్యంత జాగ్రత్తగా చదువుతున్నాడు. తొందరపాటు లేదు,ఏకాగ్రత, చిత్తశుద్దితో లెటర్ చదవడం ఆన్ లైన్ లో నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.  

ఈ వీడియో రికార్డు చేయడం వెనక ఉన్న స్టోరీని అమెజాన్ టెకీ ఇలా వివరించాడు.తన తండ్రికి చదువు లేకపోయినా.. కొడుకు భవిష్యత్ కోసం చాలా కష్టపడ్డాడని తన ఎదుగుదల వెనక తండ్రి త్యాగాలను గుర్తు చేసుకున్నాడు. ఎవరైనా నా విజయాన్ని మాత్రమే చూస్తారు.. దాని వెనక ఉన్న ఆయన కష్టాన్ని చూడరు.. అందుకే ఈ వీడియోను రికార్డు చేశానంటూ పోస్ట్ లో రాశారు. 

►ALSO READ | ద్వంద్వ పౌరసత్వం ఇష్యూ: రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశం

ఇక ఈ వీడియా చాలామంది నెటిజన్లు హృదయాలను కదిలించింది. అది ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలో ఉద్యోగం పొందడం గురించే కాదు.. దాని వెనక  అతని తండ్రి  సంవత్సరాల కృషి, సపోర్టు, నమ్మకం వంటి విషయాలను తెలియజేస్తుంది.. లెటర్ చదువుతున్న  తండ్రి కేవంలం ఉద్యోగాన్ని గురించి మాత్రమే కాదు.. దాని వెనక తాను పడ్డ కష్టం ఫలితాన్ని చూసుకుంటున్నారని నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తారు .

నెటిజన్ల నుంచి కామెంట్ల వరద.. 

ఈ వీడియో చూసిన నెటిజన్లు భావోద్వేగంతో  స్పందించారు. కామెంట్ బాక్స్ ను నింపేశారు.హృదయాన్ని హత్తుకునేది..  ప్రతి తల్లిదండ్రులకు గర్వకారణమైన రోజు అని కామెంట్ చేశారు. తమ పేరెంట్స్ ఎప్పుడూ బహిరంగంగా ఎమోషనల్ కాకపోయినా.. లోలోపల నిశ్శబ్దంగా గర్వంగా ఉంటారని.. ఈ సంఘటన వారిని గుర్తు చేసిందంటూ చాలామంది నెటిజన్లు రాశాడు.