
హైదరాబాద్, వెలుగు: ఆర్డీ ఇంజనీరింగ్ ఇంటర్- సైనిక్ స్కూల్స్ అలుమ్నీ గోల్ఫ్ టోర్నమెంట్ హైదరాబాద్‌లోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ క్లబ్‌లో గురువారం నుంచి ఈ నెల 4 వరకు జరగనుంది. దేశంలోని వివిధ సైనిక్ స్కూళ్ల పూర్వ విద్యార్థులు వ్యక్తిగత, ఇంటర్ -సైనిక్ స్కూల్ చాంపియన్‌షిప్స్ కోసం పోటీ పడతారని స్టాల్వర్ట్స్ గోల్ఫ్ డైరెక్టర్, బ్రిగేడియర్ డీవీ సింగ్ (రిటైర్డ్) తెలిపారు.