హైదరాబాద్లో గణేష్ మండపాలు.. నిర్వాహకులకు సీపీ సజ్జనార్ కీలక సూచన

హైదరాబాద్లో గణేష్ మండపాలు.. నిర్వాహకులకు సీపీ సజ్జనార్ కీలక సూచన

హైదరాబాద్ సిటీ, వెలుగు: గణేశ్ నవరాత్రి ఉత్సవ నిర్వాహకులు ముందస్తుగా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ద్వారా తమ మండపాల వివరాలను నమోదు చేసుకోవాలని హైదరాబాద్ సిటీ సీపీ సజ్జనార్ సూచించారు. 

నిర్వాహకులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా policeportal.tspolice.gov.in/index.htm పోర్టల్‌లో మండపాల ఏర్పాటుతో పాటు నిమజ్జనానికి సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలని కోరారు. మండపాలు ఎక్కడెక్కడ పెడతారో తెలిస్తే బందోబస్తు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ ఈజీ అవుతుందని పేర్కొన్నారు.