ఆర్టీసీ బస్సుల్లో రేడియో సేవలు

ఆర్టీసీ బస్సుల్లో రేడియో సేవలు

టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులను ఆకర్షించేదుకు సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తోంది. బస్సుల ఆధునీకరణ, ఆధునిక టెక్నాలజీతో నడిచే సరికొత్త బస్సులను తీసుకురావడం, పండుగలకు వినూత్న ఆఫర్స్ ప్రకటించడం.. ఇలా కొత్త విధానాలను ఆర్టీసీ అమలు చేస్తోంది. ప్రయాణికులకు ఉత్సాహాన్ని అందించేందుకు మరో అడుగు ముందుకేసింది. ‘టీఎస్‌ఆర్టీసీ రేడియో’ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. శనివారం బస్‌భవన్‌లో ఎండీ సజ్జనార్‌ కూకట్‌పల్లి డిపో బస్సులో ఈ రేడియోను ప్రారంభించారు. 

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు వినోదాన్ని అందించేందుకు ఈ సేవలు ఉపయోగపడనున్నాయని సజ్జనార్ అకాంక్షించారు. పైలట్‌ ప్రాజెక్టుగా హైదరాబాద్‌లోని 9 ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ఈ రేడియోలను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. శనివారం నుండే ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.