శాకుంతలం’ సెన్సార్​పూర్తి.. సినిమా రన్ టైం ఎంతంటే

శాకుంతలం’ సెన్సార్​పూర్తి.. సినిమా రన్ టైం ఎంతంటే

గుణశేఖర్​ దర్శకత్వంలో విజువల్​ వండర్గా తెరకెక్కింది ‘శాకుంతలం’. ఈ పీరియాడికల్​ డ్రామాలో సమంత కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్​షో పాజిటివ్​ బజ్​ ను క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్​ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యుఎ సర్టిఫికెట్​ను పొందింది. ఈ సినిమా నిడివి 2 గంటల 22 నిమిషాలు ఉండనుంది. 

శకుంతలగా సమంత.. దుశ్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్​ మోహన్​నటించారు. టీమ్​ వర్క్స్​ బ్యానర్​పై గుణశేఖర్​ కుమార్తె నీలిమ గుణ సినిమాను నిర్మించింది. అల్లు అర్జున్​ కూతురు అర్హ ఈ సినిమాలో భరతుడి పాత్రలో కనిపించనుంది.  ఏప్రిల్​14న ప్రపంచవ్యాప్తంగా శాకుంతలం విడుదల కానుంది. ప్రకాశ్​ రాజ్, మోహన్​ బాబు, సచిన్ ఖెడేకర్, అనన్య నాగళ్ల మరిన్ని కీలక పాత్రల్లో నటించారు.

అటు శాకుంతలం టీజర్‌, ట్రైలర్‌తోపాటు సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. సమంత కెరీర్ లో ఇదొక  డిఫరెంట్ జానర్ మూవీ కావడంతో శాంకుతలం కోసం  ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు.  ఈ మూవీలో పురు రాజవంశపు రాణి కావ్య నాయకి శకుంతల దేవి పాత్రలో సమంత కనిపించనుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో శాంకుతలం సినిమా రిలీజ్ కానుంది.