'సలార్' రిలీజ్ డేట్ రివీల్

'సలార్' రిలీజ్ డేట్ రివీల్

పాన్ ఇండియా రేంజ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ మూవీ రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఫైనలైజ్ అయింది. సెప్టెంబర్ 28,2023న ఈ సినిమా విడుదల కానుందని తాజాగా చిత్ర నిర్వాహకులు ప్రకటించారు. రీసెంట్ గా రికార్డులు బద్దలు కొట్టిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీయఫ్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇక సాహో, రాధే శ్యామ్ సినిమాలతో తీవ్ర నిరాశకు లోనైన ప్రేక్షకులకు... ప్రభాస్ నెక్స్ట్ మూవీపై భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. దీంతో వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న సలార్ చిత్రం కావడంతో సినీ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నిజం చెప్పాలంటే సలార్ మూవీ ఈ ఏడాది ఏప్రిల్ లోనే విడుదల కావల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం చిత్రీకరణను జరుపుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటివరకూ ఎలాంటి అప్ డేటూ లేకపోవడంతో... ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే తాజా ప్రకటనతో వారికి రిలీఫ్ అయినట్టు తెలుస్తోంది. అయితే కేజీయ‌ఫ్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింసే ఈ చిత్రాన్నీ నిర్మిస్తోంది. కాగా శ్రుతీ హాస‌న్ ఈ మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తోంది.