నెల రోజుల్లో 7 కోట్ల 44 లక్షల బీర్లు తాగారు.. ఆల్ టైం రికార్డ్ ఇదే..

నెల రోజుల్లో 7 కోట్ల 44 లక్షల బీర్లు తాగారు.. ఆల్ టైం రికార్డ్ ఇదే..

తెలంగాణలో బీర్ సేల్స్ రికార్డులు బద్దలు కొట్టింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీర్ సేల్స్ ఇదే హయ్యస్ట్ కావటం విశేషం. 2023, మే నెలలో 31 రోజులకు.. 7 కోట్ల 44 లక్షల బీర్ల అమ్మకాలు సాగాయి. అంటే రోజుకు 24 లక్షల బీర్లు అన్నమాట.. కేసుల సంఖ్యగా చూస్తే మాత్రం 62 లక్షల కేసుల సేల్స్ జరిగాయి. 

గతంలో హయ్యస్ట్ బీర్ సేల్స్ అంటే అది 2019.. ఆ సంవత్సరం మే నెలలో 60 లక్షల బీర్ కేసుల అమ్మకం జరిగింది. ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి మరీ బీర్ సేల్స్ జరగటం విశేషం. ఎండాకాలంలో బీర్ సేల్స్ పెరగటం కామన్.. అయితే 2023 సంవత్సరం మాత్రం విపరీతమైన అమ్మకాలు సాగి.. రికార్డ్ క్రియేట్ చేసింది.

 రెగ్యులర్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా 28 నుంచి 30 లక్షల కేసుల బీర్లు అమ్ముడవుతాయి. ఎండాకాలంలో బాగా పెరగటం సహజం.. ఈసారి మాత్రం రోజుకు 24 లక్షల బీర్ల చొప్పు.. 31 రోజుల్లోనే 7 కోట్ల 44 లక్షల బీర్లు అమ్ముడు కావటం సంచలనంగా మారింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి సైతం వేల కోట్ల ఆదాయం వచ్చింది. 

లీటర్ల లెక్కలో తీసుకుంటే.. చిన్నా, పెద్ద బీర్లు అన్నీ కలుపుకుంటే.. యావరేజ్ గా 4 కోట్ల లీటర్లపైనే బీరు తాగేశారు తెలంగాణ మందు ప్రియులు. 

Also Read : బీరు ఆరోగ్యానికి మంచిదా కాదా.. ఎప్పుడు.. ఎంతెంత తాగాలి