టాలీవుడ్ గ్లామర్ క్వీన్ సమంత సరికొత్త రికార్డు సృష్టించారు. జూన్ 19, 2026న రిలీజ్ అయిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ యాక్షన్ డ్రామా.. 24వ రోజు ఒక అద్భుతమైన మైలురాయిని అందుకుంది. టాలీవుడ్ లో రూ.100 కోట్ల కబ్ల్ లో చేరిన తొలి హీరోయిన్స్ గా ఘనత సాధించి చిత్ర యూనిట్‌ను గర్వపడేలా చేసింది.
రూ. 100 కోట్ల క్లబ్లో సమంత..
టాలెంటెడ్ డైరెక్టర్ నందినీ రెడ్డి, సమంత కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. టాలీవుడ్ సినీ చరిత్రలోనే ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రం ఈ అరుదైన, భారీ రికార్డును అందుకోవడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు టాలీవుడ్లో కమర్షియల్ హీరోలకే పరిమితమైన ఈ వంద కోట్ల మార్కెట్‌ను సమంత తన నటనతో, క్రేజ్‌తో బద్దలు కొట్టింది. భవిష్యత్తులో రాబోయే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఇదొక పెను సవాల్‌గా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు సినీ వర్గాలు.
Our Bangaaram @Samanthaprabhu2's reaction to 100 CRORES is just adorable ❤️#MaaIntiBangaaram crosses 100 CRORES GROSS WORLDWIDE
— Prathyangira Cinemas (@PrathyangiraUS) July 12, 2026
The FIRST EVER FEMALE-LED TELUGU FILM to hit this milestone ❤🔥
Overseas By @PrathyangiraUS pic.twitter.com/ur5nD9SWyo
క్రేజీ కాంబో..
సమంత తన సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ (Tralala Moving Pictures) బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ అగ్ర దర్శకులు, సమంత భర్త రాజ్ నిడిమోరు ఈ చిత్రానికి క్రియేటివ్ సపోర్ట్ అందించారు. సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించాయి.
ఎందుకు ఇంత క్రేజ్?..
కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, మహిళా సాధికారతను ఎమోషనల్ యాక్షన్ ప్యాక్డ్ డ్రామాగా నందినీ రెడ్డి స్క్రీన్‌పై ఆవిష్కరించిన విధానం మహిళా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతుండటంతో.. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 'మా ఇంటి బంగారం' లాంగ్ రన్ కొనసాగిస్తూ ఇంకా స్ట్రాంగ్‌గా రన్ అవుతోంది.
